News March 18, 2024
ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ భేటీ
AP: వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల(రీజినల్ కోఆర్డినేటర్లు)తో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కొనే కార్యాచరణపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ మేనిఫెస్టో అంశాలు, బస్సు యాత్రపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Similar News
News December 25, 2024
గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు
AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ ఆధారిత వేతన బిల్లులనే నమోదు చేయాలని అధికారులకు సూచించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్-2047 ఫ్రేమ్ వర్క్ బాధ్యతల్లోనూ పాలుపంచుకోవాలని పేర్కొంది. దీనిపై CM ప్రతి శుక్రవారం నిర్వహించే సమీక్షలో RTGSతోపాటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కూడా పాల్గొనాలని తెలిపింది.
News December 25, 2024
తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ బలహీనపడుతుందని IMD వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంది. కాగా బంగాళాఖాతంలో 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
News December 25, 2024
గాంధీ వందేళ్ల జ్ఞాపకం.. 2 రోజులు CWC సమావేశాలు
ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు, ఎల్లుండి కాంగ్రెస్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే ఈ సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’గా పేరు పెట్టింది. 26వ తేదీన CWC సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు సహా 200 మంది కీలక నేతలు హాజరై పలు అంశాలపై చర్చిస్తారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారు.