News March 18, 2024

ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ భేటీ

image

AP: వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల(రీజినల్ కోఆర్డినేటర్లు)తో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కొనే కార్యాచరణపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ మేనిఫెస్టో అంశాలు, బస్సు యాత్రపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Similar News

News September 21, 2024

‘లాల్‌బాగ్‌చా రాజా’కు రూ. కోట్లాది కానుకలు

image

ముంబైలోని ‘లాల్‌బాగ్‌చా రాజా’ వినాయకుడిని నగరంలో అత్యంత ఘనంగా కొలుస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గణేశ్ చతుర్థికి భక్తులు ఆయనకు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. మొత్తం రూ.5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64 కిలోల వెండి స్వామివారికి సమకూరాయని ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ స్వామి నిమజ్జన వేడుకలో అంబానీలు సహా వేలాదిమంది భక్తులు పాల్గొనడం విశేషం.

News September 21, 2024

టుడే టాప్ స్టోరీస్

image

➣AP: అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు: సీఎం చంద్రబాబు
➣TG:సింగరేణి కార్మికులకు రూ.1.90లక్షల చొప్పున దసరా బోనస్: CM రేవంత్
➣AP:కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ: YS జగన్
➣భక్తుల మనోభావాలతో చెలగాటం వద్దు: పవన్
➣జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: TTD ఈవో
➣TG: అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
➣ఉచితాలు వద్దు అనే మార్పు రావాలి: ఈటల
➣కాళేశ్వరం కింద పండే పంటలపై KCR పేరుంటుంది: హరీశ్‌

News September 21, 2024

లాలూ కుటుంబానికి మ‌రిన్ని చిక్కులు

image

ల్యాండ్ ఫ‌ర్ జాబ్‌ కేసులో కేంద్ర‌ రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేర‌కు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టుకు CBI కాపీ సమర్పించింది. ఈ కేసులో CBI ఇప్ప‌టికే లాలూ, అయ‌న కుటుంబ స‌భ్యుల పాత్ర‌పై ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. ప్రాసిక్యూష‌న్‌కు రాష్ట్ర‌ప‌తి అనుమ‌తి లభించడంతో ఛార్జిషీట్‌ను కోర్టు ఇప్పుడు స‌మీక్షించి వారిపై అభియోగాలు మోపనుంది.