News March 18, 2024
లిక్కర్ స్కామ్‌లో 15 మంది అరెస్ట్: ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 15 మందిని అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటివరకు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలతో సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 7 రోజుల కస్టడీకి అనుమతించిందని పేర్కొంది. మరోవైపు కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
Similar News
News January 9, 2025
టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు
TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫీజు గడువును సర్కార్ మరోసారి పొడిగించింది. రూ.1,000 ఫైన్‌తో ఈ నెల 22 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్/ప్రైవేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇకపై ఫీజు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు ఫీజు చెల్లించిన విద్యార్థుల జాబితాను ఈ నెల 24లోగా డీఈఓలకు సమర్పించాలని పేర్కొంది. వాటిని డీఈఓలు ఈ నెల 25లోగా తమకు పంపాలని ఆదేశించింది.
News January 9, 2025
స్పేస్ డాకింగ్ ప్రయోగం మరోసారి వాయిదా: ఇస్రో
స్పేస్ డాకింగ్ ప్రయోగం(స్పేడెక్స్) మరోసారి వాయిదా పడినట్లు ISRO తెలిపింది. ఉపగ్రహాల కదలిక చాలా నెమ్మదిగా ఉందని, ఊహించిన దానికంటే వాటి మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. తదుపరి డాకింగ్ తేదీని మాత్రం ISRO వెల్లడించలేదు. 2 ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా ఈ నెల 7న జరగాల్సిన ప్రయోగం నేటికి, నేడు మరోసారి వాయిదా పడింది.
News January 9, 2025
నేడు మీ టికెట్ యాప్ సేవలు ప్రారంభం
TG: సమయాన్ని వృథా చేయకుండా ఉన్న చోటు నుండే టికెట్లు బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ టికెట్ యాప్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ సేవలను ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. దీని ద్వారా రాష్ట్రంలోని జూ పార్క్‌లు, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు, ఆలయాలు, పార్కులు, క్రీడలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతో సులభంగా ప్రవేశం పొందవచ్చని పేర్కొంది.