News January 30, 2025
అలాంటి ఇళ్ల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
AP: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. 2019 అక్టోబర్ 15ను కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటే రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఉంటుంది. పేదలకు 150 గజాల వరకు ఉచితంగా, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరిస్తారు.
Similar News
News January 31, 2025
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి విడతగా ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13, రెండో విడతగా మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు సమావేశాలు జరుగుతాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే రిపోర్టును సభ ముందు ఉంచుతారు. రేపు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
News January 31, 2025
‘డాకు మహారాజ్’ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటివరకు ఈ మూవీ రూ.170 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా బాబీ తెరకెక్కించిన ఈ మూవీ గత నెల 12న థియేటర్లలో విడుదలైంది. థియేటర్ల వద్ద ఇంకా డీసెంట్‌గా రన్ అవుతోంది.
News January 31, 2025
నేడు పెనుగొండకు సీఎం చంద్రబాబు దంపతులు
AP: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పెనుగొండ వాసవీధామ్‌లో వాసవీమాత ఆత్మార్పణ దినంలో పాల్గొంటారు. ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వాసవీధామ్ విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు.