News January 30, 2025

కేంద్ర మంత్రులకు తప్పిన ప్రమాదం

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా అంతకుముందు వైజాగ్ ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం లభించింది. కాసేపట్లో కార్మికులతో ముఖాముఖీ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

Similar News

News November 11, 2025

ఆపరేషన్ సిందూర్ 2.0 స్టార్ట్ అవుతుందా?

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మహమ్మదే కారణమని నేషనల్ మీడియా చెబుతోంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగిన మరో ఉగ్రదాడి ఇదే. దీంతో ‘భారత గడ్డపై మరోసారి దాడి జరిగితే సహించేది లేదు’ అని ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇచ్చిన హెచ్చరికలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దీంతో మరోసారి భారత్ యుద్ధం చేస్తుందా? అని పలువురు పోస్టులు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 11, 2025

తెలంగాణ న్యూస్

image

⋆ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో CID విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. గంటపాటు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు
⋆ HYD: ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ MLAలు బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, రామదాసుపై మధురా నగర్ పీఎస్‌లో కేసు నమోదు.. BRS నేతలు వినయ్ భాస్కర్, ఆనంద్‌పై బోరబండ పీఎస్‌లో కేసు నమోదు
⋆ మరో గంటలో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌

News November 11, 2025

అధిక పాలిచ్చే పశువును ఎలా గుర్తించాలి?(1/2

image

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.