News January 30, 2025
కేంద్ర మంత్రులకు తప్పిన ప్రమాదం

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా అంతకుముందు వైజాగ్ ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం లభించింది. కాసేపట్లో కార్మికులతో ముఖాముఖీ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
Similar News
News February 15, 2025
బైక్ నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

*రోడ్లపై స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వండి
*ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయొద్దు
*స్లోగా వెళ్లేవారు ఎడమవైపు వెళ్లాలి. కుడి వైపు నుంచి ఓవర్ టేక్ చేయాలి.
*ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి లో క్వాలిటీ హెల్మెట్లు వాడతారు. వీటి వల్ల మన ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. అందుకే ISI మార్క్ ఉన్న క్వాలిటీ హెల్మెట్ వాడాలి.
*బైక్ నడుపుతూ సెల్ ఫోన్ వాడొద్దు.
*రాత్రి వేళల్లో ప్రయాణాలు వద్దు.
News February 15, 2025
పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు: CM

TG: రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ప్రణాళికలు ఉండాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. TG చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ భవిష్యత్‌కు బాటలు వేసేలా శాఖను తీర్చిదిద్దాలన్నారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఆలయాలు, పర్యాటక ప్రాంతాలపై ప్రచారం చేయాలని సూచించారు.
News February 15, 2025
మార్చి 15 నుంచి జాగ్రత్త!

దేశంలో ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 15 తర్వాత ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని తెలిపారు. నార్త్ ఇండియాలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని, కార్బన్ డయాక్సైడ్, మిథైన్, గ్రీన్ హౌస్ వాయువులతో భూమి మండుతోందని వివరించారు.