News January 31, 2025
పద్మశ్రీ కనకరాజు సంతాపసభలో పాల్గొన్న సీతక్క

జైనూర్ మండలంలోని మార్లవాయిలో గురువారం పద్మశ్రీ, గుస్సాడీ కళాకారుడు కనకరాజు సంతాప సభలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క పాల్గొన్నారు. కనకరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవేదికలపై పరిచయం చేసిన కనకరాజు సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆమె వెంట ఎమ్మెల్సీ దండే విఠల్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ తదితరులున్నారు.
Similar News
News March 15, 2025
అప్పటివరకు రోహిత్ శర్మనే కెప్టెన్?

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ వరకు భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతారని తెలుస్తోంది. ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉంటుందని బీసీసీఐ వర్గాల సమాచారం. దీనిపై బీసీసీఐ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని టాక్. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన BGTలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా 1-3 తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్లు వినిపించాయి.
News March 15, 2025
దామరచర్ల: గ్రూప్-2, 3లో సత్తాచాటిన శశి కుమార్

దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం గ్రామానికి చెందిన రాయికింది శశి కుమార్ ఇటీవలే వెలువడిన గ్రూప్-3 ఫలితాలలో 19 రాంక్, గ్రూప్-2లో 12 ర్యాంక్ సాధించాడు. శశి కుమార్ తండ్రి రామ్మూర్తి మిర్యాలగూడ ట్రాన్స్ కో లైన్మెన్గా పని చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహకంతోనే ర్యాంకు సాధించానని శశికుమార్ తెలిపారు. శశికుమార్‌ను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
News March 15, 2025
NLG: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30న సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.