News March 15, 2025

అప్పటివరకు రోహిత్ శర్మనే కెప్టెన్?

image

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ వరకు భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతారని తెలుస్తోంది. ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉంటుందని బీసీసీఐ వర్గాల సమాచారం. దీనిపై బీసీసీఐ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని టాక్. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన BGTలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా 1-3 తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్లు వినిపించాయి.

Similar News

News April 19, 2026

టాస్ గెలిచిన లక్నో

image

IPL: పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచులో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చంఢీఘర్‌లోని ముల్లాన్‌పూర్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, వధేరా, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, అర్ష్‌దీప్, చాహల్.
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, బదోని, పూరన్, ముకుల్, షమీ, ఆవేశ్, సిద్దార్థ్, ప్రిన్స్, మోహ్‌సిన్.

News April 19, 2026

పుట్టగానే శిశువుకు ఫస్ట్ బర్త్ డే!

image

దక్షిణ కొరియాలో అప్పుడే పుట్టిన శిశువు వయసును ఏడాదిగా పరిగణించే వింత ఆచారం ఉండేది. గర్భస్థ కాలాన్ని కూడా లెక్కించడమే దీనికి కారణం. అలాగే ప్రతి JAN 1న అందరికీ వయసు పెరుగుతుంది. అంటే.. DEC 31న పుట్టిన బిడ్డకు మరుసటి రోజే రెండేళ్లు పూర్తవుతాయి. అయితే 2023 నుంచి ఈ పద్ధతిని అక్కడి ప్రభుత్వం మార్చింది. దీంతో అందరి వయసు తగ్గడం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(51/100)

News April 19, 2026

‘శారీరక అవసరాలు ఉంటే చెప్పు’.. TCS కేసులో సంచలన విషయాలు

image

TCS మతమార్పిడి కేసులో ఓ బాధితురాలు ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2025లో కంపెనీలో చేరిన కొత్తలో వేరే విభాగానికి చెందిన రెజా, ఆన్‌ జాబ్ ట్రైనింగ్‌లో ఆసిఫ్ అన్సారీ వేధించారని పేర్కొంది. ఉద్యోగ రీత్యా భర్తకు దూరంగా ఉంటున్న తనతో అసభ్యంగా మాట్లాడేవారని పేర్కొంది. ‘ఏమైనా శారీరక అవసరాలు ఉంటే చెప్పు. బుర్ఖా లేకనే మీ మతంలో ఆడవాళ్లు అత్యాచారానికి గురవుతున్నారు’ అని అన్సారీ వేధించాడని తెలిపింది.