News January 31, 2025
కర్నూలులో హైకోర్టు బెంచ్ దిశగా అడుగులు

AP: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అక్కడ 15మంది న్యాయమూర్తులకు తగిన సౌకర్యాల వివరాలను తమకు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ తాజాగా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల పరిశీలన పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. YCP హయాంలో కర్నూలు శివారు దిన్నెదేవరపాడులో నిర్మించిన APERC భవనాన్ని వాడుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
Similar News
News September 19, 2025
ఈ నెల 22 నుంచి దసరా సెలవులు: లోకేశ్

AP: దసరా సెలవులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉన్నాయి. తాజాగా మార్చడంతో అదనంగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.
News September 19, 2025
3 వారాలు గడిచినా CBI నుంచి నో రిప్లై!

TG: NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరినా <<17577217>>సీబీఐ<<>> స్పందించట్లేదు. సెప్టెంబర్ 2న రాసిన లేఖకు ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్‌ను సందర్శించినా సర్కారుకు ఎలాంటి సమాచారం అందలేదు. కాగా సీబీఐ రిప్లై కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోందని ఉన్నతాధికారులు వే2న్యూస్‌తో తెలిపారు.
News September 19, 2025
ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి!

AP: కర్నూల్(D) జొన్నగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ MD హనుమప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా DGML నిలవనుంది. ఏటా 750-1000kgs గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా.