News January 31, 2025

కర్నూలులో హైకోర్టు బెంచ్ దిశగా అడుగులు

image

AP: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అక్కడ 15మంది న్యాయమూర్తులకు తగిన సౌకర్యాల వివరాలను తమకు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ తాజాగా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల పరిశీలన పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. YCP హయాంలో కర్నూలు శివారు దిన్నెదేవరపాడులో నిర్మించిన APERC భవనాన్ని వాడుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Similar News

News July 5, 2025

దారుణం: కత్తితో పొడిచి.. తాళి కట్టి.. సెల్ఫీ దిగి

image

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతికి తాళి కట్టాడు. మైసూర్‌కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు. ఇవాళ ఆమెను కత్తితో పొడిచాడు. యువతి స్పృహ తప్పి కిందపడిపోగానే మెడలో తాళి కట్టాడు. ఆపై సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. తర్వాత అతడే ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో పారిపోయాడు. పూర్ణిమ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.

News July 5, 2025

వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం

image

AP: 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లి జలాశయానికి నీటిని విడుదల చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో 419 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రానున్న రోజుల్లో కురిసే వర్షాలతో అవి మరింత పెరుగుతాయన్నారు.

News July 5, 2025

ఒక టెస్టులో అత్యధిక పరుగులు వీరివే

image

* గ్రాహం గూచ్(ENG)- 456(333, 123)
* శుభ్‌మన్ గిల్(IND)-430(269, 161)
* మార్క్ టేలర్(AUS)-426(334, 92)
* సంగక్కర(SL)-424(319, 105)
* బ్రియన్ లారా(WI)-400(ఒకే ఇన్నింగ్సు)
* గ్రెగ్ చాపెల్(AUS)-380(247, 133)
* హేడెన్(AUS)-380(ఒకే ఇన్నింగ్సు)
* సందమ్(ENG)-375(325, 50)