News January 31, 2025

రంజీ ప్రదర్శన రోహిత్‌ను ప్రభావితం చేయదు: దినేశ్ కార్తీక్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ BGTలో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా రంజీ మ్యాచ్‌లోనూ 3, 28 పరుగులతో నిరాశ పరిచారు. అయితే, త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ప్రదర్శన ఆయన్ను ప్రభావితం చేయదని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ మళ్లీ లయలోకి వచ్చేందుకు సాధన చేస్తున్నారు. BGTలో ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు. అందువల్ల రంజీ వైఫల్యం ఇంపాక్ట్ ఉండదనే అనుకుంటున్నా’ అని స్పష్టం చేశారు.

Similar News

News March 2, 2025

ఈనెల 8న కొత్త పథకాలు ప్రారంభం: మంత్రి సీతక్క

image

TG: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ రోజున CM రేవంత్ కొత్త పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. RTCకి అద్దెకు ఇచ్చే మహిళా సంఘాలకు చెందిన 50 బస్సులను ప్రారంభిస్తారని, 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.

News March 2, 2025

వైసీపీ శ్రేణులకు పనులు, సాయం చేయొద్దు: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ శ్రేణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి పనులూ చేయొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వారికి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లేనన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు గట్టిగా చెబుతున్నానంటూ హెచ్చరించారు. జీడీ నెల్లూరు కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. నాయకులు తన చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలన్నారు.

News March 2, 2025

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ATC: CM

image

TG: రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్(ITI)లను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ATC)గా అప్‌గ్రేడ్ చేయడంపై CM రేవంత్ సమీక్షించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక ATC ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ITIలు లేని కేంద్రాల్లో కొత్తగా ATCలను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాలు/పట్టణాలకు సమీపంలో ATCలు ఉండేలా చూడాలని, అవసరమైన నిధులను అందిస్తామని చెప్పారు.

error: Content is protected !!