News March 18, 2024
పాకిస్థాన్లోనూ ప్రధాని మోదీ పేరుతో మెసేజ్లు

ఇండియాలో ప్రధాని మోదీ పేరుతో వాట్సాప్లో ‘వికసిత్ భారత్’ మెసేజ్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్లోనూ చాలామందికి ఈ మెసేజ్ వస్తున్నాయట. పాక్తో పాటు దుబాయ్లో ఉంటున్న వారి ఫోన్లకు సైతం ఈ మెసేజ్ వచ్చినట్లు వారు చెబుతున్నారు. దుబాయ్లో ఉంటున్న పాకిస్థాన్ జర్నలిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఈ మెసేజ్ మీకు వచ్చిందా?
Similar News
News April 4, 2025
IPL: అట్టడుగుకు పడిపోయిన SRH

ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది. టేబుల్ టాపర్గా పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. 5 జట్లు 4 పాయింట్లతో, మరో 5 జట్లు 2 పాయింట్లతో నిలిచాయి. పాయింట్స్ టేబుల్లో PBKS తర్వాత DC, RCB, GT, KKR, MI, LSG, CSK, RR, SRH ఉన్నాయి.
News April 4, 2025
ఏప్రిల్ 4: చరిత్రలో ఈరోజు

1976: నటి సిమ్రాన్ జననం
1841: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్ మరణం
1942: తెలుగు రచయిత్రి చల్లా సత్యవాణి జననం
1968: పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం
1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించిన రోజు
గనుల అవగాహన దినోత్సవం
News April 4, 2025
లోకేశ్ నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు: అంబటి

AP: మంత్రి లోకేశ్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారి గురించి అనుచితంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ‘రెడ్ బుక్ చూసి గుండెపోటు వచ్చిందని లోకేశ్ వ్యాఖ్యానించడం సరికాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం ఉందని లోకేశ్ వికటాట్టహాసం చేస్తున్నారు. అధికార మదంతో ఆయనకు కళ్లు నెత్తికెక్కాయి’ అని అంబటి ఫైర్ అయ్యారు.