News March 18, 2024
పాకిస్థాన్‌లోనూ ప్రధాని మోదీ పేరుతో మెసేజ్‌లు
ఇండియాలో ప్రధాని మోదీ పేరుతో వాట్సాప్‌లో ‘వికసిత్ భారత్’ మెసేజ్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌లోనూ చాలామందికి ఈ మెసేజ్ వస్తున్నాయట. పాక్‌తో పాటు దుబాయ్‌లో ఉంటున్న వారి ఫోన్లకు సైతం ఈ మెసేజ్ వచ్చినట్లు వారు చెబుతున్నారు. దుబాయ్‌లో ఉంటున్న పాకిస్థాన్ జర్నలిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఈ మెసేజ్ మీకు వచ్చిందా?
Similar News
News September 14, 2024
హ్యాపీ బర్త్ డే ‘SKY’
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు నేడు. 1990 సెప్టెంబర్ 14న ఆయన ముంబైలో జన్మించారు. 2021లో 30 ఏళ్ల వయసులో SKY అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన అద్భుత ఆటతీరుతో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగారు. 33 ఏళ్లకే పొట్టి ఫార్మాట్ సారథిగా ఎంపికయ్యారు. టీ20ల్లో ఏకంగా 4 సెంచరీలు బాది సత్తా చాటారు. రెండు సార్లు టీ20 క్రికెట్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచారు.
HAPPY BIRTH DAY SKY
News September 14, 2024
అప్పుల ఊబిలో మాల్దీవులు.. చైనాతో కీలక ఒప్పందం
పొరుగుదేశం మాల్దీవులు అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆ దేశం చైనా నుంచి మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తమ మిత్ర దేశం మాల్దీవులకు తాము ఎలాంటి సహకారమైనా అందిస్తామని చైనా ప్రకటించింది. కాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు త్వరలో భారత్ పర్యటనకు రానున్న క్రమంలో ఈ అగ్రిమెంట్ జరగడం చర్చనీయాంశంగా మారింది.
News September 14, 2024
కోహ్లీతో పోరాటం కోసం ఎదురుచూస్తున్నా: స్టార్క్
ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీకి బౌలింగ్ వేసేందుకు ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అన్నారు. విరాట్‌తో పోరాటం బాగుంటుందన్నారు. ‘మేమిద్దరం ఒకరితో ఒకరు చాలా క్రికెట్ ఆడాం. మా పోరాటంలో ఉండే మజాను ఆస్వాదిస్తుంటాను. తను నాపై రన్స్ చేశారు. నేనూ ఆయన్ను ఔట్ చేశాను. ఈసారి పోరు ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.