News January 31, 2025
వారానికి 60గంటలు మించితే ముప్పే: ఆర్థిక సర్వే

వారానికి 55-60 పని గంటలు దాటితే ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలొచ్చే ఆస్కారముందని పార్లమెంట్‌కు అందిన ఆర్థిక సర్వే చెబుతోంది. రోజుకు 12hrs లేదా అంతకంటే ఎక్కువగా పని చేస్తున్న వారిలో మానసిక రుగ్మతలు వస్తున్నాయంది. ఇలా పని చేసేవారిలో మానసిక స్థితి సాధారణ సమయం పని చేసే వారికన్నా 100పాయింట్లు తక్కువ ఉన్నట్లు సాపియన్ ల్యాబ్ సంస్థ సర్వేను ఉదహరించింది. ఆఫీసులో మీరెన్ని Hours పనిచేస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News January 14, 2026
దారుణం.. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి

TG: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వీధికుక్కలపై విషప్రయోగం జరగడంతో దాదాపు 500-600 శునకాలు మృతిచెందాయి. మాచారెడ్డి(M) ఫరీద్‌పేట్, భవానీపేట, వాడి, పల్వంచలో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ‘గౌతమ్ స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్’ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
News January 14, 2026
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతగల వారి నుంచి జనవరి 15 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: bankofmaharashtra.bank.in
News January 14, 2026
ఊగిసలాటలో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎర్లీ ట్రేడింగ్‌లో ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్లు కుంగి 83,599 వద్ద.. నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 25,716 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో NTPC, టాటా స్టీల్, BEL, ట్రెంట్, M&M షేర్లు లాభాల్లో.. ఏషియన్ పెయింట్స్, TCS, బజాజ్ ఫిన్సర్వ్, HCL టెక్, ఇండిగో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


