News January 31, 2025

వారానికి 60గంటలు మించితే ముప్పే: ఆర్థిక సర్వే

image

వారానికి 55-60 పని గంటలు దాటితే ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలొచ్చే ఆస్కారముందని పార్లమెంట్‌కు అందిన ఆర్థిక సర్వే చెబుతోంది. రోజుకు 12hrs లేదా అంతకంటే ఎక్కువగా పని చేస్తున్న వారిలో మానసిక రుగ్మతలు వస్తున్నాయంది. ఇలా పని చేసేవారిలో మానసిక స్థితి సాధారణ సమయం పని చేసే వారికన్నా 100పాయింట్లు తక్కువ ఉన్నట్లు సాపియన్ ల్యాబ్ సంస్థ సర్వేను ఉదహరించింది. ఆఫీసులో మీరెన్ని Hours పనిచేస్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News February 19, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలి: CM చంద్రబాబు
* ఎవరినీ వదిలిపెట్టం.. బట్టలు ఊడదీసి నిలబెడతాం: YS జగన్
* చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP
* విభజన హామీలను పవనే సాధించాలి: ఉండవల్లి
* సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా ఉంచుతాం: రేవంత్
* రేవంత్ నిజాయితీగల మోసగాడు: KTR

News February 19, 2025

MLC ఎన్నికలు.. పదేపదే కాల్స్‌తో తలనొప్పి!

image

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏపీలో ఉభయ గోదావరి-గుంటూరు, కృష్ణా, తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ మద్దతు అడుగుతున్నారని.. రోజుకు 10 కాల్స్ వస్తే 7-8 కాల్స్ వాళ్లవే అని అసహనానికి గురవుతున్నారు. మరి మీకూ కాల్స్ వస్తున్నాయా?

News February 19, 2025

మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

image

TG: మూడో విడతలో ఐదు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. నారాయణ పేటకు సత్యయాదవ్, సూర్యాపేటకు శ్రీలత రెడ్డి, నిర్మల్‌కు రితేశ్ రాథోడ్, సిద్దిపేటకు బైరి శంకర్ ముదిరాజ్, రాజన్న సిరిసిల్లకు గోపి ముదిరాజ్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. సంస్థాగతంగా తెలంగాణలో బీజేపీకి 38 జిల్లాలు ఉన్నాయి. వీటిలో మూడు విడతల్లో 28 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది.

error: Content is protected !!