News January 31, 2025
పెద్దిరెడ్డి భూకబ్జాలు అందరికీ తెలుసు: అనగాని

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూకబ్జాల గురించి అందరికీ తెలిసిందే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన పలు జిల్లాల్లో భూకబ్జాలు చేశారని చెప్పారు. మంగళంపేట అటవీభూములు దేనికి వాడుతున్నారో తెలియడం లేదన్నారు. గెస్ట్‌హౌస్‌కా? ఎర్రచందనం అక్రమ రవాణాకా? అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. మంగళంపేట అటవీ భూములపై రెండు వారాల్లో నివేదిక వస్తుందని తిరుపతి పర్యటనలో అనగాని తెలియజేశారు.
Similar News
News November 10, 2025
భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

<
News November 10, 2025
టెర్రరిస్ట్ అరెస్ట్.. ఇంట్లోనే విషపదార్థం తయారీ!

గుజరాత్ పోలీసులు <<18243395>>అరెస్ట్<<>> చేసిన HYD వ్యక్తి డా.మొహియుద్దీన్ రైసిన్ అనే విష పదార్థాన్ని తయారుచేసినట్లు వెల్లడైంది. ఇతడు చైనాలో MBBS చదివాడు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్‌ను తయారుచేసి, దాన్ని ప్రజలపై ప్రయోగించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. రైసిన్‌ను పెద్ద మొత్తంలో పీల్చినా, ఆహారం/నీటి ద్వారా తీసుకున్నా ప్రాణాలు పోయే ప్రమాదముంటుంది.
News November 10, 2025
ఆ ఇద్దరిలో ఒకరికి RR పగ్గాలు?

వచ్చే IPL సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సారథి <<18248474>>సంజు శాంసన్<<>> జట్టును వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ ఎవరనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. దీనికి సమాధానంగా ధ్రువ్ జురెల్, జైస్వాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. RR కెప్టెన్సీ రేసులో వీళ్లే ముందున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రియాన్ పరాగ్ పేరు ఈ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం. ఎవరు RR కెప్టెనైతే బాగుంటుంది? COMMENT


