News March 19, 2024
శుభ ముహూర్తం

తేదీ: మార్చి 19, మంగళవారం,
ఫాల్గుణము
శుద్ధ దశమి: రాత్రి 12:22 గంటలకు
పునర్వసు: రాత్రి 10:10 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:39-09:27 గంటల వరకు,
రాత్రి 11:02-11:50 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 07:10-08:54 గంటల వరకు
Similar News
News August 24, 2025
గగన్‌యాన్ మిషన్.. తొలి అడుగు విజయవంతం

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో చేపట్టిన తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్(IADT-01) విజయవంతమైంది. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా క్యాప్సుల్‌ను పారాచూట్ల సాయంతో సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేసింది. ఈ పరీక్షను IAF, DRDO, నేవీ, కోస్ట్ గార్డ్‌తో కలిసి ఇస్రో చేపట్టింది. కాగా ఇండియా మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు గగన్‌యాన్ మిషన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
News August 24, 2025
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హీరో బాలకృష్ణ పేరు

నటసింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా అభిమానులను అలరించడం, 15 ఏళ్లుగా బసవతారకం ఆస్పత్రి ద్వారా ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ UKలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపును ఇచ్చింది. దేశ సినీ చరిత్రలో ఈ గుర్తింపు దక్కించుకున్న ఏకైక నటుడు NBK కావడం విశేషం. ఈ గుర్తింపు సాధించిన బాలయ్యను ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో సత్కరించనున్నారు.
News August 24, 2025
సీఎం రేవంత్‌కు KTR సవాల్

TG: CM రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సవాల్ విసిరారు. ‘పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి. 20 నెలల పాలన చూపించి ఉపఎన్నికలకు వెళ్లే దమ్ము CMకు ఉందా? సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన MLAలకు భయం పట్టుకుంది. హైడ్రా పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అతలాకుతలం చేశారు. దుర్గంచెరువు FTLలో ఉన్న రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?’ అని ప్రశ్నించారు.