News March 19, 2024

శుభ ముహూర్తం

image

తేదీ: మార్చి 19, మంగళవారం,
ఫాల్గుణము
శుద్ధ దశమి: రాత్రి 12:22 గంటలకు
పునర్వసు: రాత్రి 10:10 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:39-09:27 గంటల వరకు,
రాత్రి 11:02-11:50 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 07:10-08:54 గంటల వరకు

Similar News

News September 10, 2024

రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు: భట్టి విక్రమార్క

image

TG: రాష్ట్రంలో ఏటా రూ.20వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన రాష్ట్ర పథకాలపై వివరించారు. అక్షరాస్యత పెంపునకు రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తామన్నారు. టాటా కంపెనీ సహకారంతో 65 ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

News September 10, 2024

4 PHOTOS: విలయం తర్వాత విజయవాడ

image

AP: ఇటీవల వచ్చిన భారీ వరదలతో విజయవాడలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు వరద తగ్గిపోవడంతో ఇన్ని రోజులు నీటిలో మునిగిపోయిన వస్తువులు, వాహనాలు బురద పూసుకొని తేలాయి. ఎంతో మంది సామాన్యుల ఇళ్లలోని సామగ్రి, పుస్తకాలు, చిన్న చిన్న షాపుల్లోని వస్తువులు పూర్తిగా పాడైపోయాయి. వరదలు విజయవాడకు ఎంతలా గాయం చేశాయో పై ఫొటోల్లో చూసి అర్థం చేసుకోవచ్చు. PHOTOS – BBC

News September 10, 2024

కోలుకుంటున్న సూర్య.. బంగ్లాతో సిరీస్‌కు రెడీ!

image

బుచ్చిబాబు టోర్నమెంట్‌లో గాయపడిన T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వేగంగా కోలుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 100 శాతం రికవరీ అయ్యారని తెలిపాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా-C తరఫున బరిలో దిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 6 నుంచి మొదలయ్యే 3 టీ20ల సిరీస్‌కు అతను అందుబాటులో ఉంటారన్నాయి.