News February 1, 2025

MBNR: బి-ఫార్మసీ పరీక్షలు ప్రారంభం

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బి-ఫార్మసీ సెమిస్టర్-3 పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. బార్కోడ్స్‌పై వివరాలు సరిచూసుకోవాలని, పరీక్షల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Similar News

News January 16, 2026

మెట్రోను స్వాధీనం చేసుకోండి.. రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ

image

TG: HYD మెట్రో నెట్‌వర్క్‌‌ను L&T నుంచి <<17829072>>స్వాధీనం<<>> చేసుకోవాలని సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ తర్వాతే రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని సూచించారు. ‘రెండో దశ సన్నాహాల కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ప్రతిపాదించలేదు. వెంటనే పేర్లు పంపి సమావేశ నిర్వహణకు ప్రయత్నించండి’ అని పేర్కొన్నారు.

News January 16, 2026

HYD: పెగ్ గ్లాస్ కోసం అన్నను చంపిన తమ్ముడు

image

నాచారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్టీఫెర్డ్ రోహన్ సాయర్స్ (30), లేనర్డ్ లయనెల్ సాయర్స్ (28) మారుతల్లుల అన్నదమ్ములు. నిన్న అర్ధరాత్రి సమయంలో మేడపైన మద్యం తాగుతుండగా పెగ్ గ్లాస్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తమ్ముడు అన్నను మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి తోసేశాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

News January 16, 2026

వర్ని: కొత్త అల్లుడికి 150 వంటకాలతో విందు

image

వర్నిలో సంక్రాంతి సందర్భంగా ఇంటికి వచ్చిన అల్లుడికి 150 రకాల వంటకాలతో విందు ఇచ్చారు. లక్ష్మి-రాంబాబు దంపతులు తమ కుమార్తెకు రెండు నెలల క్రితమే వివాహం జరిపించారు. సంక్రాంతి పండుగకు తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడి కోసం మంగాదేవితో కలిసి ఏకంగా 150 రకాల తీపి, పిండి వంటలను సిద్ధం చేశారు. పెద్ద అరటి ఆకులో ఈ వంటకాలన్నింటినీ వడ్డించి, కుటుంబ సమేతంగా విందు ఇచ్చారు.