News March 19, 2024
ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో మోస్తరు వానలు
నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో 2 రోజులపాటు మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.
Similar News
News January 9, 2025
జనవరి 09: చరిత్రలో ఈరోజు
* 1915: మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగివచ్చిన రోజు
* 1922: ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు, నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా జననం
* 1934: బాలీవుడ్ సింగర్ మహేంద్ర కపూర్ జననం
* 1965: సినీ డైరెక్టర్, నటి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ పుట్టినరోజు
* 1969: తెలంగాణ తొలి దశ ఉద్యమం ప్రారంభం
* ప్రవాస భారతీయుల దినోత్సవం
News January 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 9, 2025
దోమలను చంపేందుకు కొత్త ప్లాన్!
మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు కారణమైన దోమల నివారణకు ఆస్ట్రేలియాలోని మాక్వేరీ వర్సిటీ పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. మనుషులను కుట్టే ఆడ దోమలతో శృంగారం చేసే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని చూస్తున్నారు. దీంతో దోమల బెడద తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈగలపై చేసిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఎవరికీ హాని లేదని నిర్ధారించాకే ముందుకు వెళ్తామన్నారు.