News February 1, 2025
మెదక్: పోలీసుల కౌన్సెలింగ్.. ప్రేమ పెళ్లి చేసిన పెద్దలు
రామాయంపేటలోని పెద్దమ్మ గుడి వద్ద ప్రేమ వివాహం జరిగింది. ఇరు కుటుంబాల కథనం ప్రకారం.. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మామిడాల వినయ్, రామాయంపేటకు చెందిన రేవతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య వినయ్ పెట్టడంతో శనివారం రేవతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఇరు కుటుంబీకులు ముందుకొచ్చి రేవతి, వినయ్ పెళ్లి చేశారు.
Similar News
News February 2, 2025
మహిళలను వేధింపులకు గురి చేస్తే చర్యలు: ఎస్పీ
మహిళలు మౌనం వీడి నిర్భయంగా ముందుకు వచ్చి ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షీ టీమ్స్ ద్వారా మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరిలో ఆకతాయిలపై రెండు కేసులు నమోదు చేశామని, తూప్రాన్ సబ్ డివిజన్లో 11 మంది, మెదక్‌లో 18 మందిని కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు.
News February 1, 2025
మెదక్ డీఈవో దృష్టికి ఖాళీల అంశం
మెదక్ డీఈఓ రాధాకిషన్‌ను శనివారం PRTU TS జిల్లా శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఏర్పడిన ఎమ్మార్సీలో సీఆర్పీల నియామకం, స్పౌజ్ బదిలీలతో ఏర్పడిన ఖాళీల విషయాన్ని జిల్లా అధ్యక్షులు సుంకరి కృష్ణ డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. డీఈవో మాట్లాడుతూ.. మండల విద్యాధికారులతో మాట్లాడి సమస్య త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపినట్లు పేర్కొన్నారు. పీఆర్టీయూ నాయకులు సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
News February 1, 2025
హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనందున ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.