News March 19, 2024
నీట్ దరఖాస్తులో సవరణలకు రేపే లాస్ట్

దేశవ్యాప్తంగా MBBS, BDS తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ దరఖాస్తులో సవరణలకు రేపు రాత్రి 11.59 వరకు అవకాశం ఉంది. అప్లై చేసినప్పుడు పొరపాట్లు చేసినవారు https://neet.nta.nic.in/లో లాగిన్ అయ్యి సరిదిద్దుకోవాలని అధికారులు సూచించారు. మే 5న మ.2 నుంచి సా.5.20 వరకు పరీక్ష జరగనుంది. ఈసారి దాదాపు 21 లక్షల మంది పరీక్షకు హాజరవుతారని అంచనా.
Similar News
News November 4, 2025
పురుగు మందుల పిచికారీ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

☛ పురుగు మందుల పిచికారీకి అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్, నాజిల్స్ ఎన్నుకోవాలి. ☛ ద్రావణం తయారీకి మంచినీరే వాడాలి. సిఫార్సు చేసిన మోతాదునే పిచికారీ చేయాలి. తక్కువ వాడితే మందు పనిచేయదు. ఎక్కువ వాడితే పురుగు రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. ☛ ఎండ తీవ్రత, గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు కమ్మినప్పుడు, వర్షం కురిసే ముందు పిచికారీ చేయరాదు. ☛ జలాశయాలు, చెరువులు, నీరుండే చోటు దగ్గరలో మందు కలపకూడదు.
News November 4, 2025
12 నెలల పాటు ChatGPT ఫ్రీ.. ఇలా చేయండి

ఓపెన్ ఏఐ కంపెనీ 12 నెలల పాటు ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ను <<18129528>>ఫ్రీగా<<>> అందిస్తోంది. ఇందుకోసం ఇలా చేయండి.
*ChatGPT యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
*యాప్ ఓపెన్ చేయగానే పైన కనిపించే Try Go, Freeపై క్లిక్ చేయాలి
*ఆ తర్వాత Upgrade to Goపై క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
*రూ.2 డెబిట్ అయి వెంటనే క్రెడిట్ అవుతాయి.
NOTE: ప్లాన్ యాక్టివేట్ అయ్యాక ఆటో రెన్యువల్ క్యాన్సిల్ చేయడం మర్చిపోవద్దు.
News November 4, 2025
ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీల అల్టిమేటం

TG: పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే డిసెంబర్‌లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ₹3,366 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీలో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. బిల్లులు చెల్లించకుంటే మద్యం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది.


