News February 3, 2025
నెతన్యాహు సతీమణిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్
ఇజ్రాయెల్ PM నెతన్యాహు సతీమణి సారాపై నేర విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనపై ఉన్న ఓ అవినీతి కేసులో సాక్షులను ఆమె బెదిరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు స్టేట్ అటార్నీ వెల్లడించింది. తనకు అనుకూలంగా వార్తలు రాసినందుకు కొన్ని మీడియా సంస్థలకు నెతన్యాహు డబ్బులు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. మోసం, నమ్మకద్రోహం, అవినీతిపై విచారణ జరుగుతోంది.
Similar News
News February 3, 2025
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్
TG: నేత కార్మికులకు ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్ బిగించి లబ్ధిదారులకు ఇవ్వనుంది. త్వరలోనే అర్హులను గుర్తించి తొలుత సిరిసిల్ల జిల్లాలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక యూనిట్ కింద ₹8L విలువైన 4 లూమ్స్ ఇస్తారు. యూనిట్ విలువలో 50% సబ్సిడీ, 40% బ్యాంక్ లోన్, 10% లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
News February 3, 2025
RG Kar మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనతో వార్తల్లో నిలిచిన కోల్‌కతాలోని RG Kar మెడికల్ కాలేజీలో మరో దుర్ఘటన జరిగింది. అక్కడి ESI క్వార్టర్స్‌లో MBBS విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తలుపు తీయకపోవడంతో తల్లి డోర్‌ను తోసుకుని లోపలికి వెళ్లగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రూమ్‌లో సూసైడ్ నోట్ లేదని, డిప్రెషన్ కారణంగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
News February 3, 2025
త్వరలోనే గజ్వేల్‌లో కేసీఆర్ భారీ సభ!
TG: ఏడాది కాలంగా ఇంటికే పరిమితమైన మాజీ సీఎం KCR త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై గజ్వేల్‌లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు యోచిస్తున్నారు. అనువైన స్థలం కోసం పార్టీ శ్రేణులు వెతుకుతున్నట్లు సమాచారం. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, నేతన్నలు, అన్నదాతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని తెలుస్తోంది.