News February 3, 2025

చరిత్ర సృష్టించిన రసెల్

image

వెస్టిండీస్ ప్లేయర్ రసెల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆయన కేవలం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు మ్యాక్స్ వెల్(5,915 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా 9వేల పరుగులు పూర్తి చేసిన 25వ ప్లేయర్ రసెల్ కావడం గమనార్హం. 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశారు.

Similar News

News February 3, 2025

అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడి ఆరోగ్యం విషమం!

image

అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి నుంచి మొదట ట్రామా సెంటర్‌కి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అయోధ్య సిటీ న్యూరో సెంటర్ వైద్యులు తెలిపారు. CT స్కాన్‌లో ఆయన మెదడులో రక్తస్రావం జరిగినట్లు తేలిందని వెల్లడించారు.

News February 3, 2025

నేడు లోక్‌సభ ముందుకు ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై జేపీసీ నివేదిక ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ 14 సవరణలతో కూడిన నివేదికను పార్లమెంటులో సమర్పించనున్నారు. ఆ తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించి ఆమోదించే అవకాశం ఉంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశం. అయితే ఈ సవరణలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

News February 3, 2025

మొరాయిస్తున్న ఇస్రో ఉపగ్రహం

image

గత నెల 29న ఇస్రో ప్రయోగించిన NVS-02 ఉపగ్రహంలో స్వల్ప సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. ఆక్సిడైజర్లను సరఫరా చేసే వాల్వ్‌లు తెరచుకోకపోవడంతో ఇంజిన్లు మొరాయిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఇంజిన్లు ఫైర్ అయితేనే శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. భారత్‌ సొంత నేవిగేషన్ వ్యవస్థ అయిన నావిక్‌కు NVS-02 కీలకం. ఈ నేపథ్యంలో పరిష్కార మార్గాల్ని ఇస్రో అన్వేషిస్తోంది.