News February 3, 2025

చరిత్ర సృష్టించిన రసెల్

image

వెస్టిండీస్ ప్లేయర్ రసెల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆయన కేవలం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు మ్యాక్స్ వెల్(5,915 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా 9వేల పరుగులు పూర్తి చేసిన 25వ ప్లేయర్ రసెల్ కావడం గమనార్హం. 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశారు.

Similar News

News January 13, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

MSDలా రాహుల్ ఫినిషర్ పాత్ర: ఆకాశ్ చోప్రా

image

భారత ప్లేయర్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక క్రికెట్‌లో MS ధోనీలా ఫినిషర్ పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. NZతో తొలి వన్డేలో హర్షిత్ క్రీజులో ఉన్నప్పుడు నెమ్మదిగా ఆడుతూ సుందర్ వచ్చాక గేర్ మార్చారన్నారు. ధోనీ వలే ప్రశాంతంగా ఉంటూ సింగిల్స్ తీస్తూ అవసరమైప్పుడు భారీ షాట్లు ఆడారన్నారు. బౌలింగ్ కాకుండా ఏ రోల్ పోషించేందుకైనా రాహుల్ సిద్ధంగా ఉంటారని చెప్పారు.