News February 3, 2025

English Learning: Antonyms

image

✒ Frivolous× Solemn, significant
✒ Frantic× Subdued, gentle
✒ Frugality× Lavishness, extravagance
✒ Gloom× Delight, mirth
✒ Gather× Disperse, Dissemble
✒ Gorgeous× Dull, unpretentious
✒ Glut× Starve, abstain
✒ Grisly× Pleasing, attractive
✒ Gracious× Rude, Unforgiving

Similar News

News February 3, 2025

ఇవాళ్టి నుంచి ఆర్టిజన్ల పోరుబాట

image

TG: విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లు(సబ్ స్టేషన్ల నిర్వాహకులు) వెంటనే కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 13 వరకు కన్వర్షన్ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరుతూ బస్ యాత్రను మహబూబ్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటన తర్వాత ఈ నెల 20వ తేదీన చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

News February 3, 2025

అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడి ఆరోగ్యం విషమం!

image

అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి నుంచి మొదట ట్రామా సెంటర్‌కి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అయోధ్య సిటీ న్యూరో సెంటర్ వైద్యులు తెలిపారు. CT స్కాన్‌లో ఆయన మెదడులో రక్తస్రావం జరిగినట్లు తేలిందని వెల్లడించారు.

News February 3, 2025

నేడు లోక్‌సభ ముందుకు ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై జేపీసీ నివేదిక ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ 14 సవరణలతో కూడిన నివేదికను పార్లమెంటులో సమర్పించనున్నారు. ఆ తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించి ఆమోదించే అవకాశం ఉంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశం. అయితే ఈ సవరణలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.