News February 3, 2025

English Learning: Antonyms

image

✒ Frivolous× Solemn, significant
✒ Frantic× Subdued, gentle
✒ Frugality× Lavishness, extravagance
✒ Gloom× Delight, mirth
✒ Gather× Disperse, Dissemble
✒ Gorgeous× Dull, unpretentious
✒ Glut× Starve, abstain
✒ Grisly× Pleasing, attractive
✒ Gracious× Rude, Unforgiving

Similar News

News January 18, 2026

పెద్దపల్లిలో పెంపుడు కుక్కకు ఎత్తు బంగారం

image

పెద్దపల్లి పట్టణానికి చెందిన కాసర్ల రాజు తన పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. కుటుంబసభ్యునిలా భావించే తన పెంపుడు కుక్క ఆరోగ్యం కుదుటపడాలని ఆయన సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కుకున్నారు. తాజాగా అది కోలుకోవడంతో పట్టణంలోని జెండా చౌరస్తాలోని ఓ కిరాణా దుకాణంలో శునకాన్ని త్రాసులో కూర్చోబెట్టి, దాని బరువుకు సమానమైన నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) తూకం వేశారు. స్థానికులు ఆసక్తిగా తరలివచ్చారు.

News January 18, 2026

మూడో వన్డే.. న్యూజిలాండ్ భారీ స్కోరు

image

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. మిచెల్(137), ఫిలిప్స్(106) సెంచరీల మోత మోగించడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓ దశలో NZ 58 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోగా మిచెల్-ఫిలిప్స్ నాలుగో వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సిరాజ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ తలో 3, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.

News January 18, 2026

ఇరాన్ నిరసనల్లో 16,500 మంది మృతి?

image

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ‘ఇప్పటిదాకా 16,500-18000 మంది ఆందోళనకారులు చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. 3.6 లక్షల మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే’ అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అధికారులు మిలిటరీ ఆయుధాలు వాడుతున్నారని, నిరసనకారుల తల, మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు ఉన్నాయని ఓ ప్రొఫెసర్ చెప్పినట్లు తెలిపింది.