News February 3, 2025

హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి TDPదే

image

AP: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి, ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా 23 ఓట్లు పడగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. దీంతో పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి ఓటింగ్‌లో పాల్గొన్నారు.

Similar News

News April 18, 2026

బిల్లుపై కేంద్రం Vs ప్రతిపక్షాలు.. మీ అభిప్రాయమేంటి?

image

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రజల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహిళలకు మంచి చేయాలనుకున్న కేంద్రం.. పాత రిజర్వేషన్ బిల్లునే పెట్టాల్సిందని, దానికి డీలిమిటేషన్‌ను లింక్ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. డీలిమిటేషన్‌ వల్ల అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని, ప్రతిపక్షాలకు మహిళల పట్ల గౌరవం లేకనే ఉమెన్ బిల్లును వ్యతిరేకించాయని మరికొందరు అంటున్నారు. బిల్లుపై మీ ఒపీనియన్?

News April 18, 2026

ప్రతిపక్షాలపై PM మోదీ ఆగ్రహం

image

కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్ కామెంట్స్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మండిపడ్డారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు మహిళా బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమని, పైగా సంబరాలు చేసుకోవడం ఏంటని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.

News April 18, 2026

పిల్లలతో నయన్, విఘ్నేశ్ క్యూట్ పిక్స్

image

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ కవల పిల్లలతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ ఖాళీ సమయంలో ఉయిర్, ఉలగ్‌లతో ఈ జంట సరదాగా గడిపారు. తమ చిన్నారుల అల్లరికి సంబంధించిన చిత్రాలను షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీ పేరెంట్స్‌గా వారు పంచుకున్న ఈ మధుర క్షణాలు ట్రెండింగ్‌లో నిలిచాయి.