News February 3, 2025
ప్రభుత్వానికి అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్

AP: రాష్ట్ర ప్రభుత్వానికి సినీనటుడు సోనూసూద్ 4 అంబులెన్సులు ఇచ్చారు. ఇవాళ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లిన ఆయన సీఎం చంద్రబాబును కలిసి వాటిని అందజేశారు. సోనూసూద్ ఫౌండేషన్ తరఫున ఇచ్చిన ఆ అంబులెన్సులను ప్రారంభించిన సీఎం ఆయన్ను అభినందించారు. కరోనా సమయం నుంచి అవసరం ఉన్నవారికి సాయం చేస్తూ సోనూసూద్ మంచి మనసు చాటుకుంటున్నారు.
Similar News
News March 19, 2026
ఆ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి జరగదు.. ఇరాన్‌కు ట్రంప్ హామీ

సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఖతర్‌పై ఇరాన్ అటాక్ చేయడంపై ట్రంప్ స్పందించారు. సౌత్ పార్స్ దాడితో USకు సంబంధం లేదని తెలిపారు. అలాగే ఆ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేయదని హామీ ఇచ్చారు. ఖతర్‌పై మరోసారి దాడులకు దిగితే మాత్రం ‘సౌత్ పార్స్’ను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అలా జరగడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. దీర్ఘకాలంలో ఇరాన్‌కు చాలా నష్టం అన్నారు.
News March 19, 2026
మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఉ.గోదావరి, గుంటూరు, పల్నాడు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. రాత్రి నుంచి తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.
News March 19, 2026
కొత్త శక్తికి, ఆరంభానికి ప్రతీక ఉగాది: మోదీ

తెలుగు ప్రజలకు PM మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ కొత్త శక్తికి, ఆరంభాలకు ప్రతీక అని గుర్తుచేశారు. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని AP CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘షడ్రుచులతో జీవన తత్వాన్ని ఆవిష్కరించే ఉషస్సు ఉగాది’ అంటూ TG CM రేవంత్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ప్రజలకు విషెస్ చెప్పారు.


