News February 3, 2025

ప్రభుత్వానికి అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్

image

AP: రాష్ట్ర ప్రభుత్వానికి సినీనటుడు సోనూసూద్ 4 అంబులెన్సులు ఇచ్చారు. ఇవాళ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లిన ఆయన సీఎం చంద్రబాబును కలిసి వాటిని అందజేశారు. సోనూసూద్ ఫౌండేషన్ తరఫున ఇచ్చిన ఆ అంబులెన్సులను ప్రారంభించిన సీఎం ఆయన్ను అభినందించారు. కరోనా సమయం నుంచి అవసరం ఉన్నవారికి సాయం చేస్తూ సోనూసూద్ మంచి మనసు చాటుకుంటున్నారు.

Similar News

News February 14, 2025

శుభ ముహూర్తం (14-02-2025)

image

✒ తిథి: బహుళ విదియ రా.8.55 వరకు
✒ నక్షత్రం: పుబ్బ రా.10.54 వరకు
✒ శుభ సమయం: ఉ.9.26 నుంచి ఉ.9.56, సా.4.26-సా.4.38
✒ రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
✒ యమగండం: మ.3.00 నుంచి సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: శే.ఉ.7.13 వరకు
✒ అమృత ఘడియలు: మ.3.56 నుంచి సా.5.40 వరకు

News February 14, 2025

గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తూ భారతీయుడి మృతి

image

భారత్‌లోని మీరట్‌కు చెందిన మోహిత్ కోహ్లీ అనే సైక్లిస్ట్ చిలీలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 10వేల కి.మీ దూరాన్ని సైకిల్‌పై అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలని భావించిన ఆయన దక్షిణ అమెరికాలో కొలంబియా నుంచి అర్జెంటీనాకు సైకిల్‌పై బయలుదేరారు. కొలంబియా, పెరూ, ఈక్వెడార్ దాటిన ఆయన చిలీలో ఓ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ వార్తతో మీరట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News February 14, 2025

HEADLINES TODAY

image

AP: 2027 జూన్‌కల్లా పోలవరం పూర్తికావాలి: సీఎం చంద్రబాబు
AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన అవసరం లేదు: మంత్రి అచ్చెన్న
AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
TG: విభజన తర్వాత తెలంగాణ అప్పుల్లోకి: నిర్మల
TG: వైద్య సేవల్లో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు
TG: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ కేంద్రాలు
అమెరికా చేరుకున్న మోదీ, మస్క్‌తో భేటీ
పార్లమెంటులోకి ఆదాయ పన్ను కొత్త బిల్లు
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

error: Content is protected !!