News February 4, 2025

PGECET, ICET షెడ్యూల్ ఇదే

image

TG: ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGECET నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానుంది. అదే నెల 17-19 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు ఉండనున్నాయి.

☛ MBA, MCA తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET నోటిఫికేషన్ మార్చి 6న రిలీజ్ కానుంది. అదే నెల 10 నుంచి మే 3 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. జూన్ 8, 9న పరీక్ష ఉంటుంది.

Similar News

News February 4, 2025

రైతులకు ‘సోలార్’ పంట.. అప్లై చేసుకోండిలా

image

TG: ‘PM కుసుమ్’ స్కీమ్ కింద సాగుకు యోగ్యం కాని భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది. దీనికోసం ఈనెల 22లోగా రెడ్‌కో <>సైట్‌లో<<>> అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో చోట 500kW నుంచి 2MW ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 1MW ఉత్పత్తికి 3-4 ఎకరాల భూమి అవసరం అవుతుంది. kW పవర్‌కు ₹3.13 చెల్లించి ప్రభుత్వమే విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది.

News February 4, 2025

కేసీఆర్‌ కుటుంబానికి ప్రధాని సానుభూతి

image

TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించడంతో సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న గులాబీ బాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News February 4, 2025

ఫారినర్స్‌ను పంపడానికి మంచి ముహూర్తం కావాలా: సుప్రీంకోర్టు ఫైర్

image

విదేశీయులను పంపించడానికి ఏదైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా అంటూ అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకెన్నాళ్లు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారని అడిగింది. 2 వారాల్లోగా 63 మందిని పంపేయాలని జస్టిస్ అభయ్, ఉజ్జల్ బెంచ్ ఆదేశించింది. ‘వాళ్ల అడ్రసులు తెలియవని పంపించరా? ఆ బాధ మీకెందుకు? వాళ్ల దేశానికి పంపేయండి. ఒకరిని విదేశీయుడిగా గుర్తించాక చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది.

error: Content is protected !!