News February 4, 2025

PGECET, ICET షెడ్యూల్ ఇదే

image

TG: ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGECET నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానుంది. అదే నెల 17-19 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు ఉండనున్నాయి.

☛ MBA, MCA తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET నోటిఫికేషన్ మార్చి 6న రిలీజ్ కానుంది. అదే నెల 10 నుంచి మే 3 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. జూన్ 8, 9న పరీక్ష ఉంటుంది.

Similar News

News March 9, 2026

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

image

సూరత్‌(గుజరాత్‌)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.

News March 9, 2026

విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

image

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.

News March 9, 2026

‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

image

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్‌పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్‌లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్‌లో పాల్గొనాలని అనుకునేవారు <>mygov.in<<>>లో మొబైల్ నంబర్/మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. మార్చి 20 ఈ పోటీకి చివరి తేదీ. కాగా వీబీ జీ రామ్ జీ స్కీమ్‌లో భాగంగా పని దినాలను 100 నుంచి 125కి పెంచింది.