News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్!

TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వగా అభ్యర్థుల పేర్లను ఇప్పటికీ ప్రకటించకపోవడం దీనికి ఊతమిస్తోంది. గత ఏడాది ఎంపీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది.
Similar News
News March 22, 2026
టచ్ చేస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్

తమ దేశంలోని పవర్ ప్లాంట్లపై అమెరికా దాడులు చేస్తే <<19449510>>హార్ముజ్ జలసంధిని<<>> పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ మిలిటరీ నాయకత్వం స్పష్టం చేసింది. వాటిని పునర్నిర్మించే వరకు జలసంధిని ఓపెన్ చేయబోమని తేల్చి చెప్పింది. అలాగే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని పవర్ ప్లాంట్లను, ఇజ్రాయెల్‌లోని ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
News March 22, 2026
PPPలది సక్సెస్ ఫార్ములా: చంద్రబాబు

AP: దేశంలో పీపీపీ విధానంలో చేపట్టిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు, ఎయిర్ పోర్టులు విజయవంతం అయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం, ఏఐ, డ్రోన్స్ లాంటి భవిష్యత్ టెక్నాలజీలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేలా ప్రణాళికలు రచిస్తున్నామని HYD ISBలో తెలిపారు. వివిధ దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని.. భారత్‌లో ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
News March 22, 2026
అస్సాం.. ఏ కూటమిలో ఏ పార్టీ?

అస్సాం ఎన్నికల్లో హాట్రిక్ కొట్టాలని BJP, అధికారమే లక్ష్యంగా INC హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈసారి AGP, UPPL, BPF పార్టీలతో కలిసి బీజేపీ, CPM, AJP, APHLCలతో కలిసి కాంగ్రెస్ బరిలో దిగుతున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా 16 సీట్లు గెలుచుకున్న AIUDF ఒంటరిగా బరిలో దిగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని సీఎం హిమంత, పదేళ్ల పాలనకు ముగింపు పలుకుతామని గౌరవ్ గొగొయ్ ధీమాగా ఉన్నారు.
<<-se>>#Elections2026<<>>


