News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్!

TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వగా అభ్యర్థుల పేర్లను ఇప్పటికీ ప్రకటించకపోవడం దీనికి ఊతమిస్తోంది. గత ఏడాది ఎంపీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది.
Similar News
News February 18, 2025
వంశీతో ఎందుకు ములాఖత్ అయ్యారు జగన్?: పల్లా

AP: దళిత వ్యతిరేకి, మహిళా ద్రోహి, దోపిడీదారుడైన YCP నేత వల్లభనేని వంశీతో ఎందుకు ములాఖత్ అయ్యారు? అని జగన్‌ను ప్రశ్నిస్తూ TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. దళిత ఉద్యోగి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి వేధిస్తే.. అతని కంటే మీకు నేరస్థుడు ఎక్కువైపోయాడా?, అసెంబ్లీలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన నేరస్థుడిని ఏ రకంగా పరామర్శిస్తావు జగన్? అంటూ పలు ప్రశ్నలను సంధించారు.
News February 18, 2025
Stock Markets: భారీ నష్టాల నుంచి తేరుకొని..

స్టాక్‌మార్కెట్లు నేడు ఆటుపోట్లకు లోనయ్యాయి. ఉదయం భారీగా నష్టపోయిన సూచీలు ఆఖరికి కోలుకున్నాయి. నిఫ్టీ 22,945 (-14), సెన్సెక్స్ 75,967 (-29) వద్ద ముగిశాయి. ఐటీ, O&G సూచీలు ఎగిశాయి. రియాల్టి, మెటల్, ఫైనాన్స్ సూచీలు ఫ్లాటుగా ముగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు విలవిల్లాడాయి. ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, విప్రో, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్ టాప్ గెయినర్స్.
News February 18, 2025
VVIP చాపర్ కేస్: మధ్యవర్తికి బెయిల్

అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ కేసులో బ్రిటన్ మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. CBI కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకొని సబ్మిట్ చేయాలని ఆదేశించింది. పిటిషనర్ ఆరేళ్లుగా కస్టడీలో ఉన్నారని, సప్లిమెంటరీ సహా 3 ఛార్జిషీట్లను CBI దాఖలు చేసిందని గుర్తుచేసింది. ట్రయల్ కోర్టు నిర్దేశించిన ఆంక్షలకు లోబడి, అనారోగ్య కారణాలతో ఊరటనిచ్చింది.