News February 4, 2025
1,382 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి: హైకోర్టు

TG: DSC-2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట కలిగించింది. 1,382 మందిని ఈ నెల 10లోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కోడ్‌తో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2008న ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించింది. తమకంటే తక్కువ అర్హత కలిగినవారికి రిజర్వేషన్ ఇవ్వడంపై బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
Similar News
News July 5, 2025
ఏపీ పరిధిలోకి మధిర రైల్వే స్టేషన్?

APలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కానుండటంతో SCR పరిధిలో డివిజన్ల సరిహద్దులు మారనున్నాయి. SCRలో SEC, HYD, నాందేడ్ డివిజన్లు ఉండనుండగా, విశాఖ జోన్లోకి GNT, విజయవాడ, గుంతకల్లు వెళ్తాయి. TGలోని మోటమర్రి, మధిర, ఎర్రుపాలెం, గంగినేని, చెరువు మాధవరం స్టేషన్లు VJA పరిధిలోకి వెళ్తాయి. GNT పరిధిలోని విష్ణుపురం-పగిడిపల్లి(NLG, మిర్యాలగూడ), జాన్‌పహాడ్ సెక్షన్లు SECలో కలిపే ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరాయి.
News July 5, 2025
నిరాశ వద్దు మిత్రమా.. విజయం తథ్యం!

మీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయని నిరాశ చెందుతున్నారా? తిరస్కరణలు, నష్టాలు మీకు అడ్డంకులు కావు.. అవి ప్రక్రియలో భాగం అని తెలుసుకోండి. యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్ బీస్ట్ వైరల్ అవ్వకముందు 455 వీడియోలు అప్లోడ్ చేశారు. ఆర్టిస్ట్‌గా ఫేమస్ కాకముందు పికాసో 20 వేల పెయింటింగ్స్ వేశారు. కల్నల్ సాండర్స్ KFC ఏర్పాటు చేయకముందు 1009 సార్లు ఫెయిల్ అయ్యారు. మీలా వీళ్లు కూడా అనుకుంటే సక్సెస్ అయ్యేవారా ఆలోచించండి.
News July 5, 2025
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఏపీతో జలవివాదం నేపథ్యంలో జల్‌శక్తి మినిస్టర్‌ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఇతర కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.