News February 4, 2025
1,382 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి: హైకోర్టు

TG: DSC-2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట కలిగించింది. 1,382 మందిని ఈ నెల 10లోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కోడ్‌తో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2008న ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించింది. తమకంటే తక్కువ అర్హత కలిగినవారికి రిజర్వేషన్ ఇవ్వడంపై బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
Similar News
News February 9, 2026
మెదక్: సైలెన్స్ పీరియడ్ ప్రచారం వద్దు: ఎస్పీ

మెదక్ జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెన్స్ పీరియడ్ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, ప్రచార వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు ఉండరాదని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పేర్కొన్నారు.
News February 9, 2026
టాలెంట్‌కు పరీక్షలు కొలమానం కాదు: శ్రీధర్ వెంబు

టాలెంట్‌ను కొలవడంలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ప్రమాణాలు కాదని ZOHO కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు అన్నారు. నిజ జీవితంలో ఓ వ్యక్తి అసాధారణ ప్రతిభను వీటి ద్వారా గుర్తించలేరని పేర్కొన్నారు. ఫ్రెంచ్ మ్యాథమెటీషియన్ డ్యుమినిల్ ఎప్పుడూ మ్యాథ్స్ కాంపిటీషన్‌లో పాల్గొనలేదని, అయినా సత్తా ఏంటో చూపారని Meta AI మాజీ శాస్త్రవేత్త యాన్ లెకన్ ట్వీట్ చేశారు. యాన్ కామెంట్స్‌కు మద్దతుగా వెంబు ఈ విధంగా స్పందించారు.
News February 9, 2026
ఆ డైరెక్టర్లు తిట్టినా.. డబ్బుకోసమే పనిచేశా: నటి

తాను నటించిన కొన్ని సినిమాలు విడుదలవ్వకూడదని ప్రార్థించినట్లు బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేర్కొన్నారు. తాను కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కొన్ని సినిమాలు ఎందుకు సైన్ చేశానా అని బాధ పడ్డా. సెట్‌లో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొందరు డైరెక్టర్లు అకారణంగా నన్ను తిట్టేవారు. కేవలం డబ్బు కోసమే వాటిని పూర్తి చేశాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


