News February 4, 2025
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News February 4, 2025
భయమెందుకు.. పోరాడితే గెలుపు నీదే!
క్యాన్సర్ వచ్చిందని కుంగిపోకుండా దానిని జయించేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాధి విజేతలంటున్నారు. ‘క్యాన్సర్ వచ్చిందంటే దాన్ని జయించడమే మన ముందున్న ఏకైక అవకాశం’ అని క్రికెటర్ యువరాజ్ చెప్పారు. ‘నాకు బాధితురాలిగా ఉండటం నచ్చదు. భయం, నెగిటివిటీకి నా జీవితంలో చోటులేదు’ అని నటి హంసా నందిని అన్నారు. ‘బలమైన సైనికులకే దేవుడు కష్టమైన యుద్ధాలను ఇస్తాడు’ అని నటుడు సంజయ్ దత్ చెప్పారు. భయాన్ని వీడి పోరాడి గెలవండి.
News February 4, 2025
బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్‌సాయి, శేఖర్ బాషా కాల్ సంభాషణలను అందజేశారు. పలువురు మహిళల అభ్యంతరకర వీడియోలు కలిగి ఉన్నారని మస్తాన్ సాయిపై నిన్న లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
News February 4, 2025
కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన రేవంత్
TG: కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే చేశామన్నారు. 50 రోజుల పాటు సర్వే చేశామని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసమే ఈ సర్వే నిర్వహించామని వెల్లడించారు.