News February 4, 2025
తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు.. 144 సెక్షన్
AP: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎస్వీ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నికను నేటికి వాయిదా వేశారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని నిన్న వైసీపీ ఆరోపించగా, తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Similar News
News February 4, 2025
ఆర్మీ చీఫ్ మాటల్ని RG వక్రీకరించారు: రాజ్‌నాథ్
దేశ భద్రతపై రాహుల్‌గాంధీవి బాధ్యతా రాహిత్య రాజకీయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మండిపడ్డారు. భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై ఆర్మీ చీఫ్ చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆయన వక్రీకరించారని విమర్శించారు. గస్తీ అంశంలో వివాదం తలెత్తినట్టు మాత్రమే చెప్పారన్నారు. 1962లో చైనా 38k sqkm ఆక్రమించిందని, 1963లో 5k sqkmను పాక్ ఆక్రమించి చైనాకు ఇచ్చిందన్నారు. రాహుల్ చరిత్ర తెలుసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
News February 4, 2025
బైకర్ ట్రిపుల్ సెంచరీ.. చలాన్లు చూసి పోలీసులు షాక్
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. అయితే, అలా చేయడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. KA 05 JX 1344 రిజిస్ట్రేషన్ నంబర్‌తో వెళ్తోన్న వాహనాన్ని ఆపి చెక్ చేయగా దానిపై 311 చలాన్లతో రూ.1.60లక్షల ఫైన్ గుర్తించారు. అతను హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లాంటివి పదేపదే చేశాడు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.
News February 4, 2025
సెహ్వాగ్, రిచర్డ్స్‌లాంటోడు అభిషేక్: హర్భజన్
టెస్టు క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్, వీవీ రిచర్డ్స్ స్థానాలను టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ భర్తీ చేయగలరని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఆయన రెడ్ బాల్ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇస్తారని జోస్యం చెప్పారు. ‘అభిషేక్ విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడుతున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో గణాంకాలు బాగా లేకున్నా ఇంగ్లండ్‌పై బాదిన శతకంతో టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు’ అని పేర్కొన్నారు.