News February 4, 2025
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘గేమ్ ఛేంజర్’

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ట్వీట్ చేసింది. JAN 10న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా విడుదలైన 28 రోజుల్లోనే ఈ చిత్రం OTTలోకి రానుండటం గమనార్హం.
Similar News
News March 27, 2026
విజయ్, త్రిష రిలేషన్.. సముద్రఖని ఏమన్నారంటే?

TVK చీఫ్ విజయ్, త్రిష కలిసి రిసెప్షన్‌కు హాజరవడంపై తాను చేసిన కామెంట్లను నటుడు, డైరెక్టర్ సముద్రఖని సమర్థించుకున్నారు. ‘రాజకీయాల్లో విజయ్‌ను తొలుత సపోర్ట్ చేసింది నేనే. అందుకే నా బాధను వ్యక్తం చేశా. వీడియో తీస్తున్న వ్యక్తి నా మాటలను మధ్యలో రికార్డ్ చేశాడు’ అని పేర్కొన్నారు. వారి రిలేషన్ గురించి గతంలో సముద్రఖని మాట్లాడుతూ ‘ఇదేమైనా ఆటా? వ్యక్తిగత విషయాలు అందరికీ తెలియాలా?’ అంటూ మండిపడ్డారు.
News March 27, 2026
ఇన్ఫెక్షన్లతో గుండెపోటు.. వైద్యుల సలహా ఇదే!

రక్తపరీక్షలు సాధారణంగా ఉన్నా, స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఇవి శరీరంలో వాపును పెంచి, రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. దీనివల్ల ధమనుల్లోని ప్లాక్ పగిలి ఆకస్మిక గుండెపోటుకు దారితీయొచ్చు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కఠినమైన వ్యాయామాలు చేయకండి. నోటి పరిశుభ్రత పాటించండి. గుండె ఆరోగ్యం కోసం అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడమూ ముఖ్యమే’ అని సూచిస్తున్నారు.
News March 27, 2026
రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంపు

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం 50% నుంచి 70%కి పెంచింది. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖలు రాసింది. ఉక్కు, రసాయనాలు, ఆటో మొబైల్స్, వస్త్రాలు, రంగుల వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రీ క్రైసిస్ కోటాను 40% నుంచి 50%కి పెంచింది. మరోవైపు దేశంలో యూరియా కొరత లేదని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.


