News February 4, 2025

ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘గేమ్ ఛేంజర్’

image

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ట్వీట్ చేసింది. JAN 10న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా విడుదలైన 28 రోజుల్లోనే ఈ చిత్రం OTTలోకి రానుండటం గమనార్హం.

Similar News

News February 12, 2026

సింగరేణి నిబంధనలు మార్చింది కేంద్రమే: CM

image

TG: సింగరేణి టెండర్ల నిబంధనల్లో 2018లోనే కేంద్రం మార్పులు చేసిందని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘సైట్ విజిట్‌ పర్మిషన్ తీసుకోవాలని అప్పుడే పెట్టారు. దీన్ని నిరూపిస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తారా? సింగరేణే కాదు కోల్ ఇండియా కూడా నష్టాల్లో ఉంది. సింగరేణి సంస్థ జెన్‌కోకు కూడా బొగ్గు సరఫరా చేసింది. అమాయకుడిని కాబట్టి నాపై నిందలు వేస్తున్నారు. KCRను ఎందుకు అడగడం లేదు’ అని ప్రశ్నించారు.

News February 12, 2026

T20 WC: పాక్ మ్యాచుకూ అభిషేక్ దూరం?

image

టీమ్‌ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే నమీబియాతో మ్యాచుకు దూరమైన అభిషేక్ మరో మ్యాచుకూ దూరమవ్వొచ్చని టాస్ సమయంలో SKY చెప్పారు. దీంతో ఈ నెల 15న పాక్‌తో మ్యాచుకు అభిషేక్ అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆడకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.

News February 12, 2026

2027 వరకు జిల్లాల మార్పు ఉండదు: రేవంత్

image

TG: జిల్లాల రద్దు ఉండదని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ తాజాగా.. 2027 వరకు జిల్లాల మార్పు ఉండదని పేర్కొన్నారు. అప్పుడు డీలిమిటేషన్‌తో పాటు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని ఢిల్లీలో మీడియా చిట్ చాట్‌లో అన్నారు. అప్పటివరకు.. అంటే పదిన్నరేళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.