News February 4, 2025
బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్‌సాయి, శేఖర్ బాషా కాల్ సంభాషణలను అందజేశారు. పలువురు మహిళల అభ్యంతరకర వీడియోలు కలిగి ఉన్నారని మస్తాన్ సాయిపై నిన్న లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News February 4, 2025
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం
ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన NCAలో ఉన్నారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెట్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ జట్టులోకి తీసుకుంది.
News February 4, 2025
DC ఓనర్ మన తెలుగు వారేనని తెలుసా?
IPLలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓనర్ కిరణ్ కుమార్ గ్రంధి తండ్రి ఏపీలోని రాజాంకు చెందిన GMR అధినేత గ్రంధి మల్లికార్జునరావు. ప్రస్తుతం కిరణ్ GMR ఎయిర్‌పోర్ట్స్‌కు కార్పొరేట్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఢిల్లీ, HYD, గోవా ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణ బాధ్యతలు పొందడంలో ఈయనదే కీలక పాత్ర. ఆయన సంపద $3 బిలియన్లకు పైనే. ఎవరూ ఊహించని విధంగా 2025 IPL వేలానికి ముందు పంత్‌ను వదులుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.
News February 4, 2025
రూ.400 LED బల్బును రూ.40కి తగ్గించాం: PM
తాము అధికారంలోకి రాకముందు LED బల్బుల రేటు రూ.400గా ఉండేదని, దాన్ని తాము రూ.40కి తగ్గించామని పీఎం మోదీ చెప్పారు. LED బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని, దీనివల్ల భారతీయులకు రూ.20వేల కోట్లు సేవ్ అయ్యాయని వెల్లడించారు. తాము మంచి చేస్తున్నాం కాబట్టే మళ్లీ మళ్లీ గెలుస్తున్నామని వ్యాఖ్యానించారు. కొందరు రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతారు కానీ దాన్ని అర్థం చేసుకోరని రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు.