News February 4, 2025
బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు

హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్‌సాయి, శేఖర్ బాషా కాల్ సంభాషణలను అందజేశారు. పలువురు మహిళల అభ్యంతరకర వీడియోలు కలిగి ఉన్నారని మస్తాన్ సాయిపై నిన్న లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News February 7, 2025
రెండో వన్డేలో విరాట్ ఆడతారా? గిల్ జవాబిదే

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ODIకి విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. మోకాలిలో వాపు కారణంగా ఆయన తప్పుకొన్నారు. మరి రెండో వన్డేలో ఆడతారా? ఈ ప్రశ్నకు బ్యాటర్ శుభ్‌మన్ గిల్ జవాబిచ్చారు. ‘సరిగ్గా మ్యాచ్ రోజు నిద్రలేచే సమయానికి విరాట్ మోకాలు వాచింది. దీంతో ముందు జాగ్రత్తగా తొలి వన్డే మ్యాచ్ నుంచి తప్పుకొన్నారు. అది పెద్ద గాయం కాదు. రెండో మ్యాచ్ కచ్చితంగా ఆడతారనుకుంటున్నాను’ అని తెలిపారు.
News February 7, 2025
మరోసారి.. ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇవాళ ఉదయం మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీతో పాటు నోయిడాలోని పాఠశాలలకు కూడా ఈ థ్రెట్స్ రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా స్కూళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
News February 7, 2025
ఎవరి ముందూ మోకరిల్లను: తీన్మార్ మల్లన్న

TG: తనకింకా షోకాజ్ నోటీసులు రాలేదని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న తెలిపారు. వచ్చినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. తీన్మార్ మల్లన్న ఎవరి ముందూ మోకరిల్లడంటూ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ తీరు బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది. దేనికీ నోటీసులు? వాటిని కులగణనలో భాగమైన నాయకులకివ్వాలి. అధిష్ఠానం ఆదేశాల్ని పాటించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కులగణన అనేది పూర్తిగా జానారెడ్డి నివేదిక’ అని ఆరోపించారు.