News March 19, 2024
ఇవాళో, రేపో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా?

AP: టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపటిలోగా కొంతమంది పేర్లను ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటుండగా.. 10 మందికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. మరో 16 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై CBN సమాలోచనలు చేస్తున్నారు.
Similar News
News August 28, 2025
రేపు హాల్టికెట్లు విడుదల

APలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల హాల్టికెట్లు రేపు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 7న ఈ పరీక్షలను ఆఫ్లైన్ మోడ్లో 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకోవాలని, హాల్టికెట్లను APPSC <
News August 28, 2025
కామారెడ్డికి వెళ్లలేకపోయిన సీఎం రేవంత్

TG: హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్ కామారెడ్డికి వెళ్లలేకపోయారు. దీంతో మెదక్ చేరుకుని అక్కడి ఎస్పీ ఆఫీస్లో వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్, ఎంపీ రఘునందన్ ఉన్నారు. అంతకుముందు సీఎం ఎల్లంపల్లి, పోచారం ప్రాజెక్టులను పరిశీలించారు.
News August 28, 2025
APకి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా

AP రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను ఇవాళ గంగవరం పోర్టుకు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు SEP 6 నాటికి రావాల్సిన యూరియాను సత్వరమే మంజూరు చేసింది. యుద్ధప్రాతిపదికన యూరియాను జిల్లాలకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి, త్వరలో మరో 25,000 మెట్రిక్ టన్నుల యూరియా APకి రానుందని వివరించారు.