News March 19, 2024
ఇవాళో, రేపో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా?

AP: టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపటిలోగా కొంతమంది పేర్లను ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటుండగా.. 10 మందికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. మరో 16 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై CBN సమాలోచనలు చేస్తున్నారు.
Similar News
News November 16, 2025
అదరగొట్టిన IND బౌలర్లు.. 132 పరుగులకే SA-A ఆలౌట్

రాజ్‌కోట్ వేదికగా ఇండియా-Aతో జరుగుతోన్న రెండో అనధికార వన్డేలో సౌతాఫ్రికా-A 132 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో రివాల్డో మూన్‌సామి (33) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో నిశాంత్ సింధు 4, హర్షిత్ రాణా 3, ప్రసిద్ధ్ 2 వికెట్లు పడగొట్టగా తిలక్ వర్మ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే ఇండియా-A 50 ఓవర్లలో 133 రన్స్ చేయాలి. కాగా తొలి వన్డేలో IND-A గెలిచిన విషయం తెలిసిందే.
News November 16, 2025
పంచాయతీ నిధుల వివరాలు తెలుసుకోండిలా!

గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఖర్చులను తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. కానీ ఎవరిని అడగాలో తెలియదు. అయితే ‘e-Gram Swaraj’ <
News November 16, 2025
కార్మికులపై CBN వ్యాఖ్యలు దారుణం: రామకృష్ణ

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై CM చంద్రబాబు <<18299181>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నామని CPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. కార్మికులు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారనడం దారుణమన్నారు. ఆయన మాటలు తెలుగు జాతిని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్సెలార్ మిట్టల్‌కు క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు కానీ విశాఖ స్టీలుకు ఎందుకు అడగరని ప్రశ్నించారు.


