News February 4, 2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం: CM
TG: బీసీలకు రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి BRS, BJPలకు సవాల్ విసిరారు. ‘చట్టప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. చట్టప్రకారం 42% ఇవ్వడం సాధ్యం కాకపోతే మేం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తాం. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని BRS, BJPకి అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు.
Similar News
News February 4, 2025
‘తండేల్’ టికెట్ల ధరల పెంపునకు అనుమతి
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ AP ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో ఒక్కో టికెట్పై రూ.50(జీఎస్టీతో కలిపి) వరకు, మల్టీఫ్లెక్సుల్లో రూ.75(జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకోవచ్చని తెలిపింది. సినిమా రిలీజైన వారం వరకు ఈ ధరలు కొనసాగుతాయని చెప్పింది. ‘తండేల్’ మూవీ ఈ నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News February 4, 2025
మీ ఇంట్లో సర్వే అయిందా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే సరిగ్గా చేయలేదని, ఎవరూ తమ ఇంటికి రాలేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంటికే కాదు తమ కాలనీల్లోని చాలా అపార్ట్మెంట్లలో సర్వే జరగలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ప్రజలు అందుబాటులో లేకపోవడంతో 3% మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం చెబుతోంది. మరి మీ ఇంట్లో సర్వే జరిగిందా? కామెంట్ చేయండి.
News February 4, 2025
ఎస్సీ వర్గీకరణ: మాదిగలు 32 లక్షలు, మాలలు 15 లక్షలు
TG: ఎస్సీల్లోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ కమిషన్ సిఫారసు చేసింది. మాదిగ జనాభా 32,33,642గా పేర్కొని, రెండో గ్రూపులో చేర్చారు. మాదిగతో పాటు చమర్, ముచి, చిందోల్లు, బైండ్ల తదితర కులాలు ఈ గ్రూపులో ఉన్నాయి. మాలల జనాభా 15,27,143గా ఉందని చెబుతూ వారిని గ్రూప్-3లో చేర్చారు. గ్రూప్-1లో బుడ్గ జంగం, మన్నే, మాంగ్ కులాలు ఉన్నాయి. గ్రూప్-1కు 1, గ్రూప్-2కు 9, గ్రూప్-3కి 5% రిజర్వేషన్లను సిఫారసు చేశారు.