News February 4, 2025
తొలిసారి గ్రామానికి శుద్ధ తాగునీరు!

స్వతంత్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా ఇంకా కొన్ని గ్రామాలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చుంచునా గ్రామ ప్రజలు ఎట్టకేలకు శుద్ధమైన తాగునీటిని పొందారు. దాదాపు 100 కుటుంబాలున్న ఈ మారుమూల ప్రాంతం చుట్టూ అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇన్నేళ్లు ఈ సమస్యను తీర్చలేకపోయారు. జల్ జీవన్ మిషన్ కింద అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో స్వచ్ఛమైన నీరు వారి చెంతకు చేరాయి.
Similar News
News April 15, 2026
హార్ముజ్ బ్లాక్.. ఇరాన్‌కు ఎంత నష్టమంటే?

పశ్చిమాసియాకు అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని <<19639152>>యుద్ధ నౌకలతో<<>> అమెరికా బ్లాక్ చేయడం తెలిసిందే. ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై ఆంక్షలు పెట్టింది. దీంతో ఇరాన్‌కు రోజూ 435 మిలియన్ డాలర్ల(రూ.4 వేల కోట్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. దిగ్బంధనం లేని ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన 154 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని Kpler తెలిపింది. ఆ క్రూడ్‌ను ఎగుమతి చేసేందుకు ఛాన్స్ ఉంది.
News April 15, 2026
నితీశ్‌ను గద్దె దించుతానని శపథం చేసి..

బిహార్ CMగా ఎన్నికైన BJP నేత సామ్రాట్ చౌదరి 2023లో నితీశ్ కుమార్‌ను గద్దె దించుతానని శపథం చేశారు. అప్పటివరకు తన కాషాయ తలపాగా తీయనని ప్రకటించారు. ఆనాడు ఆయన నితీశ్ రాజకీయ ప్రత్యర్థి. 2024లో JDU, BJP కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. దీంతో సామ్రాట్ శపథాన్ని పక్కనపెట్టి తలపాగా తీసి అయోధ్యలో రాముడికి సమర్పించారు. విచిత్రం ఏమిటంటే నిన్న నితీశ్ CM పదవికి రాజీనామా చేయగా ఇవాళ సామ్రాట్ గద్దెనెక్కనున్నారు.
News April 15, 2026
నేడు లక్నోతో RCB ఢీ.. కోహ్లీ ఆడతారా?

IPLలో భాగంగా ఇవాళ LSGతో RCB తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ముంబైతో మ్యాచ్‌లో కోహ్లీకి గాయమైంది. ఈ క్రమంలో ఫీల్డింగ్‌కు రాలేదు. నిన్న నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినప్పటికీ కాలికి పట్టీతో కనిపించారు. అయితే ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేశారని, మ్యాచ్ సమయానికి ఫిట్‌గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.


