News February 4, 2025
తొలిసారి గ్రామానికి శుద్ధ తాగునీరు!

స్వతంత్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా ఇంకా కొన్ని గ్రామాలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చుంచునా గ్రామ ప్రజలు ఎట్టకేలకు శుద్ధమైన తాగునీటిని పొందారు. దాదాపు 100 కుటుంబాలున్న ఈ మారుమూల ప్రాంతం చుట్టూ అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇన్నేళ్లు ఈ సమస్యను తీర్చలేకపోయారు. జల్ జీవన్ మిషన్ కింద అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో స్వచ్ఛమైన నీరు వారి చెంతకు చేరాయి.
Similar News
News February 17, 2025
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతుల పుస్తకావిష్కరణ

విజయనగరానికి చెందిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ఠ సేవా పురస్కార గ్రహీత సముద్రాల గురు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతుల పుస్తకాని రచించారు. ఈ పుస్తకాని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆవిష్కరించారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు స్పీకర్‌గా ఉన్న వెంకటరామయ్య చౌదరి నుంచి నేటి శాసన సభాపతి వరకు 23 మంది శాసనసభాపతుల రాజకీయ జీవిత విశేషాలపై రాసిన పుస్తకం బాగుందని అభినందించారు.
News February 17, 2025
TODAY HEADLINES

* అధికారులు ఏసీ గదులను వదలాలి: CM రేవంత్
* తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం: కేటీఆర్
* సీఎం రేవంత్‌కు సబ్జెక్ట్ లేదు: ఎంపీ అర్వింద్
* APలో GBSతో తొలి మరణం
* ప్రతి ఎన్నికలో గెలవాల్సిందే: సీఎం చంద్రబాబు
* ఏప్రిల్‌లో మత్స్యకారులకు రూ.20వేలు: మంత్రి నిమ్మల
* IPL-2025 షెడ్యూల్ విడుదల
* న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో 18మంది మృతి
* మరో 112 మందితో భారత్ చేరుకున్న US ఫ్లైట్
News February 17, 2025
IPL.. ఈ జట్లకు కెప్టెన్లు ఎవరు?

IPL-2025 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇటీవలి వేలంలో పలువురు ప్లేయర్లు, కెప్టెన్లు ఆయా ఫ్రాంచైజీలను వీడారు. RCB తమ కెప్టెన్‌గా రజత్ పాటీదార్‌ను ప్రకటించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా తమ కెప్టెన్లను ప్రకటించలేదు. KKRలో రహానే, వెంకటేశ్ అయ్యర్, నరైన్, రింకూ.. DCలో KL రాహుల్, అక్షర్ పటేల్, డుప్లిసెస్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరిలో కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందో కామెంట్ చేయండి.