News February 4, 2025
పంచాయతీ ఎన్నికలు: రేపటి నుంచి ట్రైనింగ్

TG: పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు రేపటి నుంచి హైదరాబాద్‌లో శిక్షణ ప్రారంభమవనుంది. వీరి శిక్షణ ముగిసిన వెంటనే ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కాగా ఈ నెల 15లోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. ఈ నెల చివరి వారం లేదా మార్చి మొదటివారంలో ఎన్నికలు జరపాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 15, 2026
ఎగుమతులు బంద్.. పడిపోతున్న బియ్యం ధరలు

TG: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్ నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంపై ప్రభావం పడుతోంది. క్రమంగా ధరలు పడిపోతున్నాయి. ఈ నెల 8న దొడ్డు ధాన్యం ధర క్వింటా ₹2,550 ఉండగా ప్రస్తుతం ₹2,450కి తగ్గింది. మరో ₹150 వరకు తగ్గే ఛాన్స్ ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌లో మరో 145L టన్నుల బియ్యం మార్కెట్లోకి రానుందని, ఎక్స్‌పోర్ట్ ఆగిపోయినందున కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని పేర్కొంటున్నారు.
News March 15, 2026
ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగింది.. దాడి చేస్తాం: ఇరాన్

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మరిన్ని దేశాలకు పాకే అవకాశం ఉంది. తమ శత్రు దేశాలకు మద్దతు ఇస్తోన్న ఉక్రెయిన్‌పై దాడి చేస్తామని ఇరాన్ పార్లమెంటరీ నేషనల్ సెక్యూరిటీ కమిటీ హెడ్ ఇబ్రహీం ప్రకటించారు. ‘ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగింది. మా షాహెద్ డ్రోన్లను నేలకూల్చేందుకు ఇజ్రాయెల్‌కు <<19328794>>సపోర్ట్<<>> చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగం మొత్తాన్ని టార్గెట్ చేస్తాం’ అని హెచ్చరించారు.
News March 15, 2026
వార్ ఎఫెక్ట్.. పాక్ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత

పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ పాకిస్థాన్‌పై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు <<19319137>>భారీగా పెరగగా<<>>, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది జీతాల్లో కోతకు ప్రభుత్వం సిద్ధమైంది. 5 నుంచి 30 శాతం తగ్గించేందుకు ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఆమోదం తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో పాక్‌లో ఇంధన, ఆర్థిక సంక్షోభం ముదురుతోందని నిపుణులు చెబుతున్నారు.


