News February 5, 2025
తండేల్ మూవీకి చైతూ రెమ్యునరేషన్ తెలుసా?
ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్నతండేల్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో చైతూ పెద్ద మెుత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు పుకారు లేవగా అది తప్పని తెలుస్తోంది. ప్రతి సినిమాకు తీసుకునే 10కోట్ల పారితోషికమే దీనికి ఛార్జ్ చేసినట్లు సమాచారం. నిర్మాతలు తన మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ ఈ సినిమాకు ఖర్చు చేయడంతో చైతూ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 5, 2025
ఓపెన్ టెన్త్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల
APలో టెన్త్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. మార్చి 17-28 వరకు రోజు విడిచి రోజు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. 17న హిందీ, 19న ఇంగ్లిష్, 21న తెలుగు/ఉర్దూ/కన్నడ/ఒరియా/తమిళం, 24న మ్యాథ్స్, 26న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, 28న సోషల్, ఆర్థిక శాస్త్ర పరీక్షలు నిర్వహిస్తారు. కాగా రెగ్యులర్ పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు జరుగుతాయి.
News February 5, 2025
ప్రభాస్ సినిమాలో సాయిపల్లవి?
హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో డార్లింగ్ ప్రేయసి పాత్ర కోసం సాయి పల్లవిని మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. సినిమాకే హైలైట్‌గా నిలిచేలా ఆ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News February 5, 2025
డీప్‌సీక్‌ను బ్యాన్ చేసిన ఆస్ట్రేలియా
ఏఐ రంగంలో ప్రపంచాన్ని షేక్ చేస్తున్న చైనా డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది. ఆ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోమ్ అఫైర్స్ సెక్రటరీ స్టెఫానీ తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు, మొబైల్ పరికరాల్లో డీప్‌సీక్ ఉత్పత్తులను నిషేధించాలని అధికారులను ఆదేశించారు. సౌత్ కొరియా, ఐర్లాండ్, ఫ్రాన్స్ కూడా డీప్‌సీక్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.