News February 5, 2025

తండేల్ మూవీకి చైతూ రెమ్యునరేషన్ తెలుసా?

image

ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్నతండేల్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో చైతూ పెద్ద మెుత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు పుకారు లేవగా అది తప్పని తెలుస్తోంది. ప్రతి సినిమాకు తీసుకునే 10కోట్ల పారితోషికమే దీనికి ఛార్జ్ చేసినట్లు సమాచారం. నిర్మాతలు తన మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ ఈ సినిమాకు ఖర్చు చేయడంతో చైతూ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 12, 2026

సంక్రాంతి సంబరాల కేసు.. అంబటికి రిమాండ్

image

AP: సంక్రాంతి వేళ లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. CM CBNపై అనుచిత వ్యాఖ్యలు సహా మరో కేసులో రాంబాబుకు ఇప్పటికే బెయిల్ లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలవుతారని YCP శ్రేణులు భావించాయి. కానీ తాజాగా మరో కేసులో రిమాండ్ విధించడంతో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.

News February 12, 2026

బాల భీముడు.. 5.20KGల బరువుతో జననం

image

TG: సాధారణంగా నవజాత శిశువులు పుట్టగానే 2.5-3.5 కిలోల బరువుంటారు. కొన్నిచోట్ల 4 కేజీల బరువుతోనూ జన్మించారు. అయితే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సంధ్యారాణి అనే మహిళ సీ సెక్షన్ ద్వారా 5.20 కేజీల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ బాల భీముడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

News February 12, 2026

కూరగాయ పంటల్లో తెగుళ్లు- కట్టడి సూచనలు

image

☛ అన్ని కూరగాయ పంటల్లో అక్షింతల పురుగు, చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2మి.లీ కలిపి పిచికారీ చేయాలి. వంగ, కాకర, ఆగాకర పంటలకు మాత్రం లీటరు నీటికి థయోడికార్బ్ 1 గ్రాము కలిపి పిచికారీ చేసుకోవాలి.
☛ మిరప, టమాటా, క్యాబేజీ వంటి పంటల్లో ఎండుతెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మెటాలాక్సిల్ + మాంకోజెబ్ 2గ్రా. కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.